01-09-2025 10:13:25 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలోని పలువురు లబ్ధిదారులకు క్యాటిల్ షెడ్డు నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి అరుణ్ సోమవారం స్థానిక జీపీలో చెక్కులు అందజేశారు. గ్రామానికి చెందిన శ్యామవ్వ, ఒంటరి మంజుల, లక్ష్మి తదితర లబ్ధిదారులకు ఒక్కొక్కరికి మంజూరైన మొదటి, రెండవ విడత చెక్కును యాదవ్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు సెక్రటరీ తెలిపారు. నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో ఒంటరి నారాయణరెడ్డి, మనోహర్ రెడ్డి, హన్మంతు తదితరులు ఉన్నారు.