calender_icon.png 2 September, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలి

01-09-2025 09:25:24 PM

 జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్ డిమాండ్

హనుమకొండ,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని తెలంగాణ హై కోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ హల్ లో సెప్టెంబర్ 3న అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి న్యాయవాదుల సమావేశం నిర్వహించనున్నారు. దానికి సంబందించిన నో ఎలక్షన్స్ నో జస్టిస్ అనే వాల్ పోస్టర్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వినర్ పొన్నం అశోక్ గౌడ్ ఆదేశాను సారం సోమవారం వరంగల్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ హల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

దీని ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ముక్యంగా న్యాయవాదుల దాడులను అరికట్టాలని, అడ్వకేట్స్ రక్షణ చట్టంకు కృషి చేయాలనీ, న్యాయవాదుల హక్కులను కాపాడాలని, జూనియర్ న్యాయవాదుల సంఘక్షేమం కోసం అదేవిదంగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని కోరుతూ హైదరాబాద్ లో సెప్టెంబర్ 3న తలపెట్టిన సమావేశం ను న్యాయవాదులు హాజరై విజయవంతం చేయాలనీ శ్రీనివాస్ కోరారు.