కూకట్‌పల్లిలో ప్రమాదం.. మున్సిపల్ వర్కర్ మృతి
29-11-2025 11:34 AM
- చెట్లకు నీళ్ళు పోస్తున్న మున్సిపల్ కార్మికుడు.
- కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఘటన.
- కార్మికుడిని అతి వేగంగా ఢీకొట్టిన కారు.
- మద్యం మత్తులో కారు డ్రైవర్.
హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో(Kukatpally Housing Board Colony) శనివారం ఉదయం వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో మున్సిపల్ కార్మికుడు(Municipal Worker) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం, కార్మికుడు రోడ్డు పక్కన ఉన్న చెట్లకు నీరు పోస్తుండగా, అధిక వేగంతో వచ్చిన కారు అతనిపైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కార్మికుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడైన డ్రైవర్‌ను గుర్తించి అతనిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.




