02-01-2026 02:51:02 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో 20 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ గజానంద్ విడుదల చేశారు. ఈ ముసాయిదా ఓటరు జాబితాను మున్సిపల్ కార్యాలయం, ఆర్‌డీఓ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయ నోటీస్ బోర్డులపై ప్రజల పరిశీలన కోసం ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.మొత్తం 20 వార్డులలో 13,905 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు – 6,812,మహిళలు – 7,092,ఇతరులు – 2 మంది ఉన్నారని తెలిపారు.ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే, సంబంధిత ఆధారాలతో లిఖితపూర్వకంగా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ గజానంద్ ప్రజలకు సూచించారు.