02-01-2026 02:48:46 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జనవరి 21, 2026 గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల బాలికల బాలుర పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి & 6 నుంచి 9వ తరగతులలో ఖాళీ సీట్లలో ప్రవేశం కొరకు (ఇంగ్లీష్ మీడియం) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆసక్తి గలవారు జనవరి 21 ,2026 లోపు కుల సర్టిఫికెట్ ఆదాయ సర్టిఫికెట్, ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉంటుందని, వివరాలకు https://tgcet.cgg.gov.in ను కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.