calender_icon.png 2 January, 2026 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీటీడీ ఆలయంతో పాటు కళ్యాణ మండపాన్ని మంథనిలో నిర్మించాలి

02-01-2026 02:45:42 PM

మంథని,(విజయక్రాంతి): టీటీడీ ఆలయం మరియు కళ్యాణ మండపాన్ని మంథని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా గల మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కు చెందిన ఖాళీ స్థలంలో నిర్మించాలని కోరుతూ మంథని ఆర్డీఓ కాశబోయిన సురేష్ కు శుక్రవారం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ మాజీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బెజ్జంకి డిగంబర్ అధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ మాట్లాడుతూ మంథని ప్రజలందరికీ టీటీడీ ఆలయం, కళ్యాణ మండపం అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఆర్డీవో సురేష్ కు వినతి పత్రం ద్వారా అందజేయడం జరిగిందన్నారు. సానుకూలంగా స్పందించిన ఆర్డీఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి స్థల పరిశీలన కోసం పరిశీలిస్తామన్నారు.డిగంబర్ తో పాటు బిజెపి మాజీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్  పాల్గొన్నారు.