02-01-2026 02:56:41 PM
124 వార్డులలో 2 లక్షల 58 వేల 59 ఓటర్లతో డ్రాఫ్ట్ జాబితా సిద్ధం
జనవరి 10న తుది ఓటర్ జాబితా ప్రచురణ
పట్టణాలలో ఓటర్ జాబితాపై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): పట్టణ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలు (పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్) 1 మున్సిపల్ కార్పొరేషన్ (రామగుండం) కలిపి మొత్తం 124 వార్డులలో 2 లక్షల 58 వేల 59 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సిద్ధం చేశామని అన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు సరైన వార్డులో ఉందా లేదా చెక్ చేసుకోవాలని లేని పక్షంలో వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తమ ఫిర్యాదు నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.
జనవరి 10న పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్ జాబితా తయారీపై జనవరి 5న మున్సిపల్ కార్యాలయాల్లో, జనవరి 6న కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.