calender_icon.png 2 January, 2026 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి దీపాల ఏర్పాటు

02-01-2026 02:53:25 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని రాంనగర్ 10వ వార్డులో శుక్రవారం వీధి దీపాలను ఏర్పాటు చేశారు. వాంకిడి గ్రామ సర్పంచ్ చునర్కర్ సతీష్ పర్యవేక్షణలో పనులు చేపట్టారు. వార్డులో చీకటి సమస్యను పూర్తిగా తొలగించేందుకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు సభ్యురాలు మండోకర్ తూర్సు బాయ్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.