calender_icon.png 27 July, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాకాలంలో గ్రామాలను శుభ్రంగా ఉంచండి

26-07-2025 12:00:00 AM

- ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 

కొత్తకోట జులై 25 : వర్షాకాలంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత ఎంతో ప్రధానమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కొత్తకోట మం డల పరిధిలోని రామంతపూర్ గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాల పరిశుభ్రత పై సిబ్బంది ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్న తీరును స్వ యంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో గ్రామాల్లో సీజన ల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత ఎంతో ప్రధానమని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని గ్రామస్తులకు సూ చించారు. అదేవిధంగా గ్రామంలో ఓ చిన్నారి డెంగ్యూ బారిన పడగా వారి ఇంటికి వెళ్లి పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నారు. పాప ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్టులను చూసి ఇతరులకు వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి

రామంతపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ తిరిగి పరిశీలించారు. లబ్ధిదారులు నిర్మాణ ప్రక్రియ దశలవారీగా పూర్తి చేసిన వెంటనే ఫోటోలు అప్లోడ్ చే యాలని పంచాయతీ కార్యదర్శి ఆదేశించారు. పేమెంట్లలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

ఇంకా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైతే గ్రౌండింగ్ ప్రారంభించలేదో వారు వెంటనే నిర్మాణం ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, ప్రాజెక్టు ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, హౌసింగ్ శాఖ అధికారి విఠోభా, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీఓ సుదర్శన్, హెల్త్ సుపర్వేజర్ ప్రమీల , ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.