calender_icon.png 24 May, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకం ప్రకారమే హత్య!

24-05-2025 01:25:28 AM

బద్రును మేమేం చంపామంటూ గూడూరు పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు

గూడూరు. మే 23: (విజయ క్రాంతి); మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామంలో బావిలో శివమై తేలిన బద్రు హత్య గావించబడ్డాడని పోలీసులు నిర్ధారించారు. పాత పగలతోనే నిందితులు పథకం ప్రకారం బద్రును హత్య చేసి బావిలో పడేశారని నిందితులు గూడూరు పోలీసుల ముందు శుక్రవారం లొంగిపోయారు.

వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామానికి చెందిన తేజావత్ బద్రు కనబడుట లేదని ఆయన భార్య నీల ఈనెల  21 రోజున గూడూరు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనలో అనుమానితులుగా ఉన్నవారిని విచారించగా మేమే చంపమని ఒప్పుకున్నారు.

ఈ సందర్భంగా గూడూరు విలేకరులు సమావేశంలో గూడూరు సిఐ సూర్యప్రకాష్  మాట్లాడుతూ మృతుడు  బద్రు దగ్గర నిందితుడు వీరేందర్ తన అవసరం నిమిత్తం 50 వేల రూపాయలు అప్పు చేయడం జరిగిందని ఆ డబ్బులను బద్రు పదేపదే వీరేందర్ ను అడగడం ద్వారా విసుకు చెందడంతో పాటు చెల్లి పెళ్లి కోసం అమ్ముకున్న భూమిలో ఒక  గుంటన్నర దున్నుకొని తన చెల్లి పెళ్లికి అడ్డుపడుతున్నాడని ఉద్దేశంతో భద్ర పై పగ పెంచుకొని ఇదే విషయంలో తన సహచరుడు సురేష్ తో చెప్పగా సురేష్ కూడా బద్రు గతంలో నా  భూమి విషయంలో కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని ఇద్దరు బద్రును చంపాలని పథకం పన్నారు.

ఈ సందర్భంలో సురేష్ పథకం ప్రకారం మరో నిందితుడు తేజవత్ కిషన్ అదేవిధంగా మరో నిందితుడు బదావత్ ఈర్యా తొ కలిసి ఈనెల 20 తేదీన సాయంత్రం 8 గంటలకు గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద కల్వర్టు మీద కిషన్ మరియు ఏరియాలో కలిసి మందుపాటి చేసుకోగా ఈ పార్టీలో భద్రకు ఫుల్ గా మందు తాగించి అనుకున్న పథకం ప్రకారం వీరేందర్ కిషన్ సురేష్ లు బద్రు మెడకు టవల్ చుట్టి చంపడం జరిగిందని చంపిన తర్వాత ఎవరు రాని సమయం చూసి నక్కలగుట్ట బోడ్ పక్కన ఉన్న బావిలో పడవేసి బద్రు బండిని టెంపుల్ దగ్గర బావిలో పడేసి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు కాగా నిందితులు తేజ వత్ వీరేందర్ కిషన్ సురేష్ ఏరియా లు శుక్రవారం పోలీసుల దగ్గరికి వచ్చి తామే చంపమని ఒప్పుకోవడం జరిగింది ఈ సందర్భంగా మృతదేహాన్ని పంచనామా నిర్వహించి వారి బంధువులకు అప్పగించడం జరిగిందని సీఐ సూర్యప్రకాశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎస్త్స్ర గిరిధర్ రెడ్డి కొత్తగూడ ఎస్‌ఐ కుశ కుమార్ ప్రొఫెషనల్ ఎస్త్స్ర కోటేశ్వరరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు