24-05-2025 01:51:48 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లెటర్ టు డ్యాడీ.. ఓ ఓటీటీ ఫ్యామిలీ డ్రామా టైటిల్‌లా ఉంది. ఈ లేఖ కాంగ్రెస్ వదిలిన బా ణం. రాష్ట్ర ప్రజలకు సరైన పాలన అందించడంలో అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ రెండూ విఫలమయ్యాయి. వారి వైఫల్యాన్ని బీజేపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీల కుటుంబమైనా, కల్వకుంట్ల కుటుంబమైనా.. కుటుంబ పాలనకు మేం వ్యతిరేకం. కుటుంబ రాజకీయాలను, వ్యక్తిగత సమస్యలను ప్రజల బాధగా మార్చే ప్రయత్నం చేయొద్దు. ఏ అంశంలోనైనా బీజేపీ ఎవరినీ ఉద్దేశపూర్వకంగా జైలుకు పంపబోదు. వారు చేసిన తప్పుల మేరకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
కేంద్రమంత్రి బండి సంజయ్
కేసీఆర్ కుటుంబంలో వివాదాలంటే ఎవరూ నమ్మరు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఒక జోక్‌లా కనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబంలో వివాదాలంటే ఎవరూ నమ్మరు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఆ లేఖను సృష్టించారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. అలా చేయడం మాకేం అవసరం. బీఆర్‌ఎస్ పార్టీలో ఎలాం టి విబేధాలు లేవు.. పక్కా ప్లాన్ ప్రకారమే అన్ని పార్టీలను గందరగోళం నెట్టేందుకు ఆ డుతున్న నాటకం.
బీఆర్‌ఎస్ ఖేల్ ఖతమైం ది. వంద జాకీలు పెట్టినా లేవదు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో రాజు, యువరాజు ఫొ టోలు తప్ప మరెవరివి కనిపించలేదు. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థి లేక బీజేపీకి ఓట్లు వేశారు. కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టులు మొత్తం కొట్టుకుపోతున్నా యి. మొత్తం 3 బరాజ్‌లు తీసేయాల్సిందేనని ఒక సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌గా చెబుతున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కవిత లేఖపై సమాధానం ఇవ్వండి
“బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు సమాధానం చెప్పాలి. బీఆర్‌ఎస్ పార్టీలోని కొందరు బీజేపీతో ఎందుకు స్నేహపూర్వకంగా ఉంటున్నారు, గతంలో 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీతో బీఆర్‌ఎస్ ఎందుకు స్నేహంగా ఉన్నదని కవిత ప్రశ్నించారు.
ఇదే ప్రశ్న కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని బీజేపీకి సరెండర్ చేశారు. కేసీఆర్ సూచన మేరకే కిషన్‌రెడ్డి అధ్యక్షుడు అయ్యారు. నేషనల్ హెరాల్ పత్రికపై ఈడీ పేరుతో బీజేపీ వేధింపు కార్యక్రమం చేపట్టింది. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ తో టచ్‌లో ఉందనడం అపోహ మాత్రమే”.
మంత్రి పొన్నం ప్రభాకర్
కవిత లేఖ కాంగ్రెస్ కుట్రనేమో!
“తండ్రి అందుబాటులో ఉన్నా కూతురు లేఖ రాయవలసిన అవసరం ఏమొచ్చిందో ఎమ్మెల్సీ కవిత చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్‌ను కలిసే పరిస్థితి కూడా కవితకు లేదా. అన్న కేటీఆర్‌తో ఉన్న రాజకీయ వైరం లో ఇది భాగం కావచ్చు. అసలీ లేఖ కవిత రాసిందేనా? రాస్తే ఎలా బయటకు వచ్చిం ది? ఎవరు రిలీజ్ చేశారు? చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈ లేఖ వెనుక కాంగ్రెస్ పొలి టికల్ గేమ్ ఏమైనా ఉందేమోననే సందేహా లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీనే కవిత పేరుతో లేఖను రిలీజ్ చేసిందేమో. బీజేపీని టార్గెట్ చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారేమో. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈసారి ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణాలో గెలిచేది బీజేపీనే.
ఎంపీ డీకే అరుణ
మరో షర్మిల.. కవిత
కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయితీనా.. లేక ఆస్తుల పంచాయితీనా. రాష్ర్టంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు వచ్చాయి. ఇప్పుడు అవి వారసత్వ యుద్ధంగా మారా యి. పార్టీ నుంచి కవితను కట్టుబట్టలతో బయటకు పంపేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ఒక్కటయ్యారు. రానున్న రోజుల్లో కవిత మరో షర్మిల కావొచ్చు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె వెంట ఉండి అంతా నడిపిస్తున్నది పాత వ్యాపార భాగస్వామి సీఎం రేవంత్‌రెడ్డే.
మెదక్ ఎంపీ రఘునందన్
లిక్కర్ కేసు నుంచి దృష్టి మళ్లించేందుకే
కవితకు తన తండ్రితో గానీ, పార్టీ నాయకత్వంతో గానీ సమస్యలుంటే అవి వారి అంతర్గత విషయాలు, ఇందులో బీజేపీని ఎందుకు లాగుతున్నారు. ఢిల్లీ ఎక్సుజ్ పాలసీ కుంభకోణంలో ఆమె ప్రమేయంపై దృష్టిని మళ్లించేందుకే కవిత చేసిన నాటకమే ఈ డాడీకి లేఖ. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసికట్టుగా మోసపూరిత డ్రామా ఆడుతూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి. కవిత వ్యాఖ్యలు ఆ పార్టీలోని అంతర్గత చిచ్చును బహిరంగంగా చూపిస్తున్నాయి.
బీజేపీ అధికార ప్రతినిధి
ఎన్వీ సుభాష్
బీఆర్‌ఎస్ మునిగిపోయే నావ
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన పాపాలను ఎమ్మెల్సీ కవిత తాను రాసిన లేఖల ద్వారా బయటపెట్టారు. బీఆర్‌ఎస్ మునిగిపోయే నావ, అందులో నుంచి బయటికి రావాలని కవిత చూస్తోంది. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుంది. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరిగిన అన్యాయం కవితకు గుర్తుకు రాలేదు.
వరంగల్ సభలో కేసీఆర్ ఒక్కడే నియంతలా మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు మధ్య ఉన్న బంధాన్ని పార్లమెంట్ ఎన్నికల ముందే బయటపెడితే.. బీజేపీకి ఆ సీట్లు కూడా వచ్చేవి కావు. మేడిగడ్డలో కాంగ్రెస్ నేతలు బాంబులు పెట్టారని కేటీఆర్ అనడం శోఛనీయం. బీఆర్‌ఎస్ గురించి ఆలోచించే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డికి లేదు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
బీఆర్‌ఎస్, బీజేపీ వేర్వేరు కాదు
బీఆర్‌ఎస్, బీజేపీ వేర్వేరు కాదని గతంలో మేం చెప్పాం. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత బయటపెట్టింది. కవిత అడిగిన ప్రతి ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పాలి. బీజేపీ, బీఆర్‌ఎస్ ములాఖత్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సీట్లే నిదర్శనం. బీజేపీకి మద్దతు ఇవ్వడంలో కేటీఆర్ ఎప్పుడు ముందుటారు. తెలంగాణ సమాజానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌తోనే నష్టమన్నారు.
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్