మూసీ ప్రాజెక్టు..రాష్ట్ర భవిష్యత్తు
- అభివృద్ధి, మానవీయతను సమన్వయం చేస్తూ ముందుకు
- ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్‌రూం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తెలంగా ణ భవిష్యత్తు అభివృద్ధికి, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. మూసీ నది పునరుజ్జీవం.. నగరానికి కొత్త జీవం పోస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు అ వసరమైన భూసేకరణ, పునరావాసం తదితర అంశాలపై సచివాలయంలోని తన ఛాం బర్‌లో మంత్రి పొంగులేటి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ నదిని పునరుజ్జీవింప జేసి, దాన్ని పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా మార్చాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి దూరదృష్టి అన్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, పర్యావరణహితమైన జీవన వాతావరణాన్ని అందించే సంకల్పమని వివరించారు. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వాక్‌వేలు, వినోద కేంద్రా లు ఏర్పాటు ద్వారా మూసీ పరీవాహక ప్రాంతాలను సరికొత్త జీ వన కేంద్రాలుగా మారుతాయన్నారు.
గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్టుగా మూసీ ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యా యం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గుర్తుచేశారు. భూ సేకరణ ప్రక్రియలో ప్రజాకోణంలో ఆలోచించి మా నవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని అధికారులకు సూచించారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని ఇందుకు అవసరమైన కా ర్యాచరణ రూపొందించి, తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. భూములు కోల్పో యే వారికి చట్టబద్ధమైన పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభు త్వం ఎటువంటి రాజీ పడబోదని మంత్రి స్పష్టం చేశారు.






