30-08-2025 11:16:43 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో గణేష్ చతుర్థి వేడుకల్లో సందర్భంగా రాధాకృష్ణ యాదవ సంఘం ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద ఎండి ఖాజా మియా సలీమా దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. గణనాథుడికి ప్రీతిపాత్రమైన పండ్లను సమర్పించారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు భిన్నత్వంలో ఏకత్వం అని కొనియాడారు.