31-08-2025 09:47:00 AM
హైదరాబాద్: ఆదివారం రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్ డ్రైవ్ లో జస్టిస్ పీసి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును.. అల్లోపతిక్ ప్రతీక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంట్స్ బిల్లును ప్రవేశపెట్టింది. చర్చల అనంతరం ఈ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సభలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ... సెషన్స్ లో ఉన్నప్పుడు బిల్లు రూపంలో తీసుకోవలసిన అవసరం ఉంటుందని, తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధనలపై చర్చిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సీపెక్ట్ సర్వే చేపట్టిందని.. సిపెక్స్ సర్వే తో పాటు ఇతర డేటాను అధ్యయనం చేసి లోతుగా విశ్లేషించి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం సామాజిక ఆర్థిక పరిస్థితులతో పోలిస్తే వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతుందని నివేదిక తెలిపిందని.. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు సిఫారసు చేసిందన్నారు. వెనుకబడిన తరగతుల జనాభాను దృష్టిలో పెట్టుకొని జనాభా నిష్పత్తికి అనుగుణంగా సరైన ప్రాతినిధ్యం లేకపోవడం గుర్తించామని.. వెనుకబడిన తరగతులకు అనుకూలంగా తెలంగాణ పురపాలక చట్టం 2019లో సవరించేందుకు నిర్ణయించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.