30-08-2025 11:13:32 PM
అమీన్ పూర్ సీఐ నరేష్
పటాన్ చెరు/అమీన్ పూర్,(విజయక్రాంతి): నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అమీన్ పూర్ సీఐ నరేష్ అన్నారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. శనివారం రూపాశ్రీ కౌంటిలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను సీఐ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తూ కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.