calender_icon.png 31 August, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్ గ్రామంలో చోరీ

30-08-2025 11:22:39 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల పరిధిలోని ఎల్బీనగర్ గ్రామంలో శనివారం రాత్రి దొంగతనం జరిగింది.గ్రామానికి చెందిన వల్లభనేని శ్రీనివాసరావు శనివారం ఉదయం ఆరోగ్య సమస్యలపై విజయవాడలోని ఆసుపత్రికి కుటుంబంతో కలిసి వెళ్లారు.ఇంటికి తాళం వేసి ఉండటంతో గమనించిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఆదివారం ఉదయం పనిమనిషి శ్రీనివాసరావు ఇంటి వద్దకు వెళ్లగా తలుపులు తీసి ఉండటం బీరువా తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు అందించడంతో ఎస్ఐ చలికంటి నరేష్ తన సిబ్బందితో శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి తలుపులు తీసి పరిశీలించారు.

రెండు ఇనుప బీరువాలు తెరిచి ఉండటం,ఇంట్లో వస్తువులను చిందరవందరగా వేశారు.విషయాన్ని ఫోన్ ద్వారా స్థానికులు శ్రీనివాసరావుకి తెలపగా ఇంట్లో కొంత నగదు,బంగారం ఉన్నట్లుగా చెప్పినట్లు తెలిసింది. శ్రీనివాసరావు ఇంట్లో కుక్క ఉన్నప్పటికీ దానికి మత్తుమందు ఇచ్చి దొంగతనానికి పాల్పడటం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంట్లో కుక్క ఉన్న విషయం గమనించటం దానికి మత్తుమందు ఇచ్చేందుకు ప్రయత్నించటం లాంటి విషయాలని గమనిస్తే తెలిసినవారే దొంగతనానికి పాల్పడవచ్చని స్థానికులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వివరాలు సేకరించారు.