10-05-2025 12:23:05 AM
హుజూర్ నగర్: భారత సైన్యానికి హుజూర్ నగర్ ముస్లింలు మద్దతు తెలిపారు. పాకిస్తాన్ కి వ్యతిరేకం గా ప్లకార్డులు ప్రదర్శించి ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముస్లింల మత గురువు మౌలానా అబ్దుల్ రహీయ్ మాట్లాడుతు ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత సైన్యం భీకర పోరు చేసి ఉగ్రవాదులను అంత మొందించిన మన భారత సైనికులకు సంఘీభావం మద్దతు తెలియజేసి సెల్యూట్ చేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మత పెద్దలు ఎండి అజీజ్ పాషా, షేక్ మన్సూర్ అలీ, ఎంఏ అబ్దుల్ మజీద్ భాయ్, బిక్కన్ సాహెబ్, నవాబ్ జానీ, ఎస్డి మున్న, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.