calender_icon.png 26 November, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి..

26-11-2025 07:41:29 PM

సిడబ్ల్యుసి సభ్యులు సమీర్ ఉల్ల ఖాన్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృశ్య బాలల హక్కులను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యులు సమీర్ ఉల్ల ఖాన్ అన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ష్యూర్ ఎన్జీవో ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడబ్ల్యుసి కమిటీ సభ్యుడు సమీర్ ఉల్ల ఖాన్, డిసిపిఓ రాజేంద్రప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ సూరజ్ సింగ్ హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సమీర్ ఉల్ల ఖాన్ మాట్లాడుతూ.. మీ హక్కులను మీరు తెలుసుకున్నప్పుడే మీ హక్కుల కాపాడ్డానికి  పని చేస్తున్న వాళ్లు ఎవరు తెలుసుకోవాలన్నారు. పిల్లల హక్కులు, వాటి విధి విధానాల తో పాటు పనిచేసే విధానం గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం డిసిపిఓ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ఆపదలో ఉన్నవారు ఎవరికి భయపడకుండా డయల్ 100, 1098 కి కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, షూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ వినోద్, ఫీల్డ్ సూపర్వైజర్లు సంపత్ కిరణ్, సౌజన్య , కేస్ వర్కర్ రామకృష్ణ, తదితరులు ఉన్నారు.