26-11-2025 07:50:01 PM
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆకాక్షించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్, వైఎంఎస్ కాలనీలోని నవజ్యోతి హైస్కూల్ 40 సంవత్సరాల రియూనియన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ నవజ్యోతి హైస్కూల్ 40 సంవత్సరాల నుండి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఎంతోమంది ఉత్తములను తయారుచేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్వో రమేష్ , ఎంఈవో జెమినీ , సిఐ గడ్డం మల్లేశ్, డైరెక్టర్ ఇందిరా, కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, అరువ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.