calender_icon.png 26 November, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగం ఒక మహోన్నత గ్రంథం

26-11-2025 07:32:28 PM

మెట్ పల్లి (విజయక్రాంతి): భారత రాజ్యాంగం ఒక మహోన్నత గ్రంథం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా బుధవారం మండల్ లీగల్ సర్వీసేస్ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి న్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసిన అనంతరం రూపొందించుకున్న గొప్ప రాజ్యాంగం మనది అని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగంతోనే దేశంలో భిన్న మతాలు, కులాలు, సంస్కృతులు కలిసి ఉంటున్నాయని తెలిపారు. అనంతరం న్యాయవాదుల చేత ఆయన రాజ్యాంగం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. ప్రణయ్, ఉపాధ్యక్షులు తోగిటి రాజ శేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, జాయింట్ కార్యదర్శి గజేల్లి రాందాస్, క్రీడా, సాంస్కృతిక కార్యదర్శులు బిగుల్లా శంకర్, మెడిచెల్మల సుమలత, మన్నె గంగాధర్, గజభీంకర్ వెంకటేష్, గురిజెల గోపి, బార్ సభ్యులు పాల్గొన్నారు.