26-11-2025 07:25:40 PM
ఆ గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే..
తాండూరు (విజయక్రాంతి): అదృష్టం అంటే ఆ కుటుంబానిదే... ఆ కుటుంబానికి గ్రామపంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ కలిసొచ్చింది.. అంతేకాదు రెండు వార్డు సభ్యులు సైతం ఆ కుటుంబానికి వరించింది.. పూర్తి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామానికి సర్పంచ్ ఎన్నికలకు గాను అధికారులు షెడ్యూల్ ట్రైబల్ వర్గానికి రిజర్వ్ చేశారు. అయితే ఆ గ్రామంలో 8 వార్డులకు గాను 494 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎరుకలి భీమప్ప కుటుంబం ఒకటే ఉంది. రిజర్వేషన్ పుణ్యమా అని ఈ కుటుంబం నుండే ఎవరికో ఒకరికి సర్పంచ్ పదవి దాదాపు ఖరారు కానుంది. అంతేకాదు రెండు వార్డులు ఎస్టీ జనరల్, ఎస్టి ఉమెన్ రిజర్వ్ కావడంతో ఆ కుటుంబం నుండి మరో ఇద్దరు వార్డు సభ్యులు కూడా కానున్నారు. ఇక కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు తమ పార్టీ తరఫునుండి నామినేషన్ వేయాలంటూ ఆ ఇంటికి క్యూ కట్టారు. ఏది ఏమైనా రిజర్వేషన్ ఆ కుటుంబ అదృష్ట తలుపు తట్టిందని చెప్పవచ్చు.