26-11-2025 07:42:51 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రవీణ్ టోనీ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.
అలాగే గత ప్రభుత్వ దోపిడీ, అహంకారపూర్వక పాలనను ప్రజలకు అవగాహన చేస్తూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందేలా కృషి చేయాలని ఆయన చెప్పారు. రిజర్వేషన్ల ప్రకారం బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి పార్టీ శక్తిని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.