26-11-2025 07:51:28 PM
కోదాడ: కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీ కళ్యాణి మల్టీ స్పెషలిటీ డెంటల్ క్లినిక్ వారిచే బుధవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ కళ్యాణి గొంతు, దంత వైద్య నిపుణులు డాక్టర్ వంగవీటి కళ్యాణిచే విద్యార్థినులకు దంతాలు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థినులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గాంధీ, అధ్యాపకులు రమేష్, స్రవంతి, రాజేష్, వైద్యశాల సిబ్బంది సాయి, లక్ష్మి విద్యార్థినులు పాల్గొన్నారు.