26-11-2025 07:29:06 PM
మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు..
కరీంనగర్ (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్ రావు అన్నారు. బుధవారం నగరంలో కాంగ్రెస్ హామీలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ తయారుచేసిన కరపత్రాల పంపిణీ, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగాసునీల్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఎన్నికల హామీలన్నీ కూడా తుంగలో తొక్కిందన్నారు.
మహిళలకు ఇస్తామన్న నెలకు 2500 రూపాయలు, వృద్ధులకు వికలాంగులకు ఇస్తాము అన్న పెన్షన్ 2000 నుంచి 4000, 3000 నుంచి 6000, విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీలు, ఏ హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సరైన బుద్ధి చెప్పే విధంగా ప్రజలు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బొందల ప్రవీణ్, ఉపేందర్, పండుగ నాగరాజు, శ్రీనివాస్ గాంధీ, రాజ్ ప్రభాకర్, కుంభం అనిల్, హమీద్, బాలు, బీమారి సత్యం, శ్రీకాంత్, మేకల కిరణ్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.