calender_icon.png 26 November, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ పాఠశాలలో ఆకట్టుకున్న విద్యార్థుల విన్యాసాలు

26-11-2025 07:27:29 PM

కుంటాల (విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రమైన కుంటాల తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బుధవారం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం ఉత్సాహాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఎత్రాజ్ రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉందని రాజ్యాంగం కోసం ఎంతో త్యాగం చేసే మహానాడు అంబేద్కర్ గొప్ప వ్యక్తిని ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమని రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు నైతిక విలువలను కాపాడుకోవాలని పేర్కొన్నారు. రాజ్యాంగం యొక్క విలువలను విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో చాలా విలువైందని పేర్కొన్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.