03-05-2025 12:00:00 AM
మంచిర్యాల, మే 2 (విజయక్రాంతి): జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్న మెంట్లో 75+ కేటగిరీలో సింగిల్స్, డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన జిల్లా క్రీడాకారుడు పి.రాజలింగు అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
శుక్రవారం తన చాంబర్లో థాయిలాండ్లో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్ కు ఎంపికైన రాజలింగుకు బ్యాడ్మింటన్ సం ఘం తరుపున రూ.20 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ రాజలింగు అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ కంది కట్ట మధుకుమార్, ప్రతినిధులు నల్ల వెంకటేశ్వర్ల, నలివెల శంకర్, వెన్నపురెడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు.