03-05-2025 12:00:00 AM
చారకొండ, మే 2 : చారకొండ మండల కేంద్రంలో జాతీయ రహదారి బైపాస్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి న్యాయం చేయాలని ధర్మ స మాజ్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మహారాజ్ కోరారు.
శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బైపాస్ నిర్మాణ కోసం 29 మంది ఇండ్లను ఫిబ్రవరి 29న కూల్చివేసి 15 రోజుల్లో వారికి న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అన్యాయం చేయడం తగదని అన్నారు.
ప్రభుత్వం స్పందించి వెంటనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల తమ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకో లు చేస్తామని హెచ్చరించారు.