24 June, 2026 | 2:01 AM

జనగణనలో కీలకపాత్ర పోషించాలి

24-06-2026 12:07 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్ 23: జనగణన కార్యక్రమంలో సూపర్వైజర్లు, బీఎల్వో లు కీలకపాత్ర పోషించాలని తహసీల్దార్ బి శ్రీకాంత్ కోరారు.మంగళవారం మండల కేంద్రం అర్వపల్లి లోని తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్వోలు,సూపర్వైజర్లతో సమావే శ నిర్వహించి జనగణన ఫారాలతో పాటు కిట్లను అందజేశారు.

అనంతరం ఆయన మా ట్లాడుతూ జనగణన సర్వేలో సూపర్వైజర్లు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, నిక్సాన ఓటరు జాబితా గుర్తింపు చేపట్టాలని సూచించారు.ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా గుర్తించడానికి సిబ్బంది సహకరించాలని,సూపర్వైజర్లు తమ పర్యవేక్షణను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీటీ అశ్విని,ఆర్‌ఐ పాటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.