ఎస్‌ఐఆర్ అమలుపై అవగాహన కలిగి ఉండాలి
-బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి
ఖైరతాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): పార్టీ శ్రేణులు ఎస్‌ఐఆర్ కార్యక్రమ అమలుపై అవగాహన కలిగి ఉండాలని బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు.పార్టీ సీనియర్ నాయకుడు మాజీ చైర్మన్ మహమ్మద్ హర్షద్ అలీ నివాసంలో ఓటర్ మ్యాపింగ్ అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నూతన ఓట్లను నమోదు చేయించడంతో పాటు ఓటర్ల వివరాల్లో మార్పులు,చేర్పులు చేయడం ఎలా అనే విషయాలను వివరించారు.అర్హులైన ప్రతి ఓటును కాపాడాలని, అనర్హులైన వారి ఓటు తొలగించేలా అధికారులకు సహకరించాలని సూచించారు.అదే విధంగా ఎన్యుమరేషన్ విషయంలో ఓటర్లకు సహకరించాలని కోరారు.తద్వారా పారదర్శకమైన ఓటరు జాబితా నిర్మాణంలో భాగస్వాములు కావాలని పార్టీ నాయకులు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.






