calender_icon.png 22 October, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలిచి తీరాలి

22-10-2025 01:37:10 AM

  1. జూబ్లీహిల్స్ బీజేపీకి ప్రతిష్టాత్మకం 
  2. ప్రతి కార్యకర్త శ్రమించి దీపక్‌రెడ్డిని గెలిపించాలి : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 
  3. కాషాయ జెండా ఎగరడం ఖాయం : బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు 
  4. అమ్మవారి ఆశీస్సులతో విజయభేరి మోగిస్తాం : పార్టీ అగ్రనేతలు
  5. బీజేపీ భారీ ర్యాలీ.. నామినేషన్ దాఖలు చేసిన దీపక్‌రెడ్డి  

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21   (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పే ర్కొన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లోకి వస్తుందని.. ప్రతి కార్యకర్త బూత్ స్థా యి నుంచి ఇంటింటి ప్రచారం చేసి దీపక్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం, పా ర్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర అ గ్రనేతల సమక్షంలో భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ సమర్పించారు.

కేంద్ర మం త్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌తో పాటు పార్టీ అధ్యక్షుడు ఎన్. రామ చం దర్ రావుతో కలిసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వెంకటగిరిలోని విజయదుర్గ పోచ మ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం, ఆలయం నుంచి షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయం వ రకు వేలాది మంది కార్యకర్తలతో ప్రారంభ మైన భారీ ర్యాలీ.. యూసుఫ్‌గూడ మీదుగా సాగింది. చివరగా, దీపక్ రెడ్డి తన నామినేష న్ పత్రాల సెట్‌ను రిటర్నింగ్ అధికారి సా యి రాముకు సమర్పించారు. ర్యాలీ సందర్భంగా యూసఫ్‌గూడలో.. జరిగిన సభలో నేతలు ప్రసంగించారు.

గెలుపు ఖాయం : కేంద్రమంత్రి బండి సంజయ్

‘గత ఎన్నికల్లో దీపక్ రెడ్డికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేసి విజయాన్ని అందుకుంటాం. మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు ఖాయమనిపిస్తోంది’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావు సహా పలువురు ముఖ్య నేతలు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో విజయభేరి మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గట్టి పోటీ ఇద్దాం : రాంచందర్‌రావు

జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ వ్యూహాలకు అనుగుణంగా పనిచేసి, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు గట్టి పోటీ ఇద్దాం అని అన్నారు. సిట్టింగ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో టీడీపీలో పనిచేసి, ప్రస్తుతం బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న లంకల దీపక్ రెడ్డికి నియోజకవర్గంపై మంచి పట్టుంది. 2023 ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఈసారి గెలుపే లక్ష్యంగా బీజేపీ బరిలోకి దిగింది.

త్రిముఖ పోరు.. ఎన్నికల షెడ్యూల్ ఇలా..

ఈ ఉప ఎన్నికలో మొత్తం 170కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ తరఫున దివంగత గోపీనాథ్ సతీమణి మగంటి సునీత, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణల గడువు ముగియనుంది. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.