22-01-2026 03:11:27 PM
తరిగొప్పుల, జనవరి 22 (విజయక్రాంతి): తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వగలబోయిన యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా ముత్తా సాంబరాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా నీల రాజు, యూత్ అధ్యక్షులుగా, నీల సంపత్, ఉపాధ్యక్షులుగా బండారి ప్రశాంత్, ఎన్ ఎస్ ఐ అధ్యక్షులుగా మండల రాజు, బీసీ సెల్ అధ్యక్షులుగా బాలగోని శీను ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు.తమ పై నమ్మకం తో బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీ, మండల కమిటీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ అర్జుల పోసిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పింగిలి ఇంద్రారెడ్డి, భీమ నాయక్, సర్పంచ్ కావటి సుధాకర్, భాష బోయిన రమేష్, సూర్య నాయక్, కాసాని గాలయ్య, భాష బోయిన సురేష్, తదితరులు పాల్గొన్నారు.