22-01-2026 03:10:03 PM
కామారెడ్డి అర్బన్,జనవరి 22(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా డీసీహెచ్‌ఎస్ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దోమకొండ మండలంలో ఏర్పాటు చేయనున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం గురువారం స్థల సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి వెంకటేశ్వర్లు, మండల సర్వేయర్, మండల రెవెన్యూ అధికారులు సహా ఇతర మండల అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రి డిఈ అరవింద్ హాజరై నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించారు. భవిష్యత్‌లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సర్వే చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తిర్మల్ గౌడ్, గ్రామ ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్‌తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.