calender_icon.png 17 August, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్తవ ఘటన ఆధారంగా మటన్ సూప్

16-08-2025 12:20:58 AM

రమణ్, వర్షా విశ్వనాథ్ హీరోహీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ ట్యాగ్‌లైన్. అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (బీవీసీ) బ్యానర్లపై మల్లికార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ నూతన సినిమా టైటిల్, మోషన్ పోస్టర్లను విడుదల చేశారు. పోస్టర్లు ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ “టైటిల్ బాగుంది. ‘మటన్ సూప్’కి ప్రేక్షకాదరణ దక్కి, విజయవంతం కావాలి” అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో, దర్శకనిర్మాతలతోపాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, లైన్ ప్రొడ్యూసర్ కొమ్మా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జెమినీ సురేశ్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్‌ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్ వివిధ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వెంకీ వీణ; కెమెరా: భరద్వాజ్, ఫణీంద్ర; ఎడిటింగ్: లోకేశ్ కడలి.