calender_icon.png 17 August, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక రోజు ముందే బోర్డర్2

16-08-2025 12:19:51 AM

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘బోర్డర్2’.  ‘బోర్డర్’కు సీక్వెల్ ఇది. తొలుత దీన్ని వచ్చే ఏడాది జనవరి 23న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఒక రోజు ముందే రిలీజ్ కానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ శుక్రవారం విడుదల చేసిన పోస్టర్‌లో జనవరి 22నే సినిమా విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ‘బోర్డర్’లో సునీల్ శెట్టి నటించగా ఈ సీక్వెల్‌లో ఆయన తనయుడు ఆహాన్ శెట్టి భాగమయ్యారు. యువ హీరో వరుణ్ ధావన్, పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ సైతం ఇందులో నటిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్‌కు జోడీగా మేధా రాణా కనిపించనుంది.