calender_icon.png 13 May, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ

12-05-2025 12:37:11 AM

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 11 (విజయ క్రాంతి) ఖమ్మం నగరంలో ఆదివారం ఖానాపురం హవేలీ ప్రశాంతి నగర్ లో తెలంగాణ జన సమితి జిల్లా పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించారు. అనంతరం కొలిపాక ఫంక్ష న్ హాల్ లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారులు ఎవ్వరు అధైర్య పడద్దన్నారు .

కేసీఆర్ చెప్పిన మోసపూరిత మాటల వల్లే ఈ రోజు ప్రతిపక్షం లో ఉండటానికి కారణం అన్నారు.  ఖమ్మం జిల్లా లో క్రియాశీలక పాత్ర పోషించడమే మన పార్టీ ముందు ఉన్న లక్ష్యమని కోదండ రాం కార్యకర్తలకు పిలుపునిచ్చారు . విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తు న్న నాయకులకు ఎప్పుడు ప్రాధన్యత ఉంటుందన్నారు . కో ట్లాడి తెలంగాణ తెచ్చిన దాంట్లో మనం ముందు వరసలో ఉ న్నాం అని ఇపుడు చివరి వరుసలోకి నెట్టివేయబడ్డడానికి కారణం గతపాలకుల కుటీలత్వమే కారణం అన్నారు .

జై తెలంగాణ అంటే ఆనాడు నవ్విన వాళ్ళు ఉన్నారని,కొందరు ఆంధ్ర నాయకులు హేళన చేసి అవమానిస్తే రక్తం సల సల మసీలేదని గుర్తుచేశారు . ఎంత అవమానించినా మొక్కవోని దీక్షతో పోరాడమని, ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలమే తె లంగాణ రాష్ట్రం సాధ్యం అయిందన్నారు .

నిప్పు కొరకాస్ లా గా మండి బలిదానాలు చేసుకున్న విద్యార్థులు ఎందరో ఈ రాష్ట్రం కోసం పోరాడితే ఈనాడు ఏదో పదవులు ఆశించి ఆనాడు పోరాడ లేదని, తెలంగాణ వస్తె బ్రతుకుతో పాటు బ్ర తుకుదెరువు ఉంటది అనుకున్నాం కానీతెలంగాణ వచ్చినాక మనల్ని పక్కకు నెట్టేశారని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ ప్రభుత్వంలో కాస్త గుర్తింపు వచ్చిందని కౌన్సిల్ లో కూడా  ఉద్యమ కారులు గురించి లేవనెత్తాను అన్నారు .

ప్రతి ఉద్యమ కారుడికి 250 గజాల జాగా ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఉద్యమ కారుల మిగిలిన దానికి కూడా పోరాడాల్సిన అవసరమే ఉన్నది .మన ఆకాంక్ష ను ప్రభుత్వానికి తెలిజేస్తానని, హమీ అమలు అయ్యేలా ప్రయత్నం చేస్తానాన్నరు.త్వరలో విస్తుత స్థాయి సమావేశం ఉంటుందని నిరుద్యోగం ఈ జిల్లాలో బాగా ఉందని , ఉపాధి అవకాశాలు లేక మాదక ద్రవ్యాలకు , డ్రగ్స్ కు అలవాటు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు .

కుల గణన గొప్ప విషయం అ న్నారు. వారం రోజుల్లో జిల్లా కమిటీ ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి శ్రీ గోపగాని శంకర్రావు, తెలంగాణ జన సమి తి జిల్లా అధ్యక్షులుగా షేక్ సర్దార్ హుస్సేన్ , తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్, రాష్ట్ర యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలీం పాషా,

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేవీ కృష్ణారావు, ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పసుపులేటిన ఆసరయ్య, ఖమ్మం నగర నాయకులు ఎస్కే మహ బూబ్ బాషా, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రసాద్, వైరా ని యోజకవర్గ నాయకులు ఎస్కే అక్బర్ , డేవిడ్ తదితరులు పాల్గొన్నారు .