23-05-2025 12:18:02 AM
వరంగల్ సభలో బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదు?
ఉద్యమ నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదు?
రేవంత్ మిమ్మల్ని తిడుతున్నా మీరు హుందాగా మాట్లాడారు..
పాజటివ్, నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ అంటూ రజతోత్సవ సభపై లేఖ
సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న లేఖ
గులాబీ పార్టీలో కలకలం
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌కు లేఖ రాశారంటూ ఓ వార్త సంచలనం సృష్టించింది. కేసీఆర్‌కు కవిత లెటర్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ లేఖ మొత్తం ఆరు పేజీలున్నది.
ఇటీవల ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభపై ఆమె అభిప్రాయాలను పాజి టివ్, నెగిటివ్ కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఆ లేఖలో పేర్కొన్నట్లుగా ఉంది. ఆ సభలో కేసీఆర్ ప్రసంగంలోని అంశాలపై కవిత తన అభిప్రాయాలను ఆ లేఖలో పంచుకున్నట్లు ఉన్నది.
నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ అంశాలు..
సభలో బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదు?
వక్ఫ్ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదు?
ఎస్సీ వర్గీకరణపై ఎందుకు మాట్లాడలేదు?
బీసీ 42శాతం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదు?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు?
బీఫార్మ్ మీరే స్వయంగా ఎందుకు ఇవ్వడం లేదు?
క్యాడర్‌తో మీరు ఎందుకు మాట్లాడటం లేదు?
కాంగ్రెస్‌కు పోటీ మన నేతలే బీజేపీ అని చెబుతున్నారు మీకు తెలుసా?
నేను అరెస్ట్ అయ్యాకనే పార్టీ పరువు పోయిందని మీరు నమ్ముతున్నారా?
ఉద్యమనేతలను ఎందుకు పట్టించుకోవడం లేదు?
అందరూ అనుకుంటున్నట్లుగా బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందా?
కొందరికే అందుబాటులో ఉంటున్నారు ఎందుకు?
ఉర్ధూలో ఎందుకు మాట్లాడలేదు.. వక్ఫ్ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదు?
2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు వరంగల్ సభ వేదికపై మాట్లాడే చాన్స్ ఎందుకివ్వలేదు? పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అంశాలు..
వరంగల్ సభ క్యాడర్‌కు భరోసా ఇచ్చింది మావోయిస్టులపై జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను ఖండించారు సంతోషం.
రేవంత్‌రెడ్డి తిడుతున్నా మీరు ఒక్కమాట అనలేదు. హుందాగా ఉన్నారు బావుంది
అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని చెప్పడం..
పహల్గాం మృతులకు మౌనం పాటించాలని చెప్పడం, కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్ అంటూ మీరు చెప్పిన తీరు బాగుంది.
ప్రసంగంలో మీరు పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ కూడా బాగుంది..
ఇప్పటికైనా రెండు మూడు రోజుల్లో ప్లీనరీని ఏర్పాటు చేసి క్యాడర్ అభిప్రాయాలు తీసుకోవాలి. కొంచెం ఈ విషయం సీరియస్‌గా ఆలోచించండి అని ప్రస్థావించినట్లుగా లేఖలో ఉంది. చివరలో పెద్ద లెటర్ రాసినందుకు సారీ అంటూ పేర్కొన్నట్లుగా ఆ లెట ర్‌లో ఉంది.