01-08-2025 01:20:54 AM
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో జరిగిన అవకతవకలపై విచారణ చేసి నివేదిక ఇవ్వడం వరకే తన పని అని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల కుంగుబాటుపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదికను అందజేసింది.
ఈమేరకు బీఆర్‌కేభవన్‌లోని కమిషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహు ల్ బొజ్జాకు రెండు సీల్డ్ కవర్లలోని నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ అందజేశారు. అనం తరం మీడియాతో జస్టిస్ ఘోష్ మీడియా తో చిట్‌చాట్ నిర్వహించారు. జూలై 31వ తేదీతో కమిషన్ విచారణ ముగిసిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి 650 పేజీల కు పైగా తుది నివేదిక అందజేశామని పేర్కొన్నారు.
కమిషన్ ఆర్డర్ ప్రకారం తుది నివేదిక ఉంటుందని స్పష్టం చేశారు.మంత్రివర్గం సమక్షంలోనే నివేదికను ఓపెన్ చేస్తారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభు త్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తనకు తెలియదని చెప్పారు.
సీఎస్‌కు కమిషన్ నివేదిక..
గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు, నా ణ్యతా లోపాలు, బరాజ్‌ల కుంగుబాటుపై ప్రస్తుత ప్రభుత్వం 2024 మార్చి 14వ తేదీన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత మొదటి లోక్‌పాల్ జస్టిస్ పీసీ ఘోష్‌ను కమిషన్ చైర్మన్‌గా నియమించింది.
మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బరాజ్‌లను పరిశీలించడంతోపాటు ఎక్కువ మందిని విచారించాల్సి రావడం, క్రాస్ ఎగ్జామినేషన్, విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ నివేదికల పరిశీలన వంటి కారణా లతో కమిషన్ గడువును ప్రభుత్వం ఆరుసార్లు పొడిగించింది. విచారణలో భాగంగా దాదాపు 16 నెలల పాటు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ సహా నీటిపారుదల శాఖ చెందిన ము ఖ్య అధికారులు నుంచి మొదలుకుని కింది స్థాయి ఇంజినీర్ల వరకు అందరి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
విచారణలోని అంశాలను క్రోడికరించి తుది నివేదికను తాజాగా ప్రభుత్వానికి కమిషన్ అందించిం ది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నివేదిక అందుకున్న తర్వాత నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మీడియాతో మా ట్లాడారు. కమిషన్ నుంచి తీసుకున్న నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అందజేస్తామని తెలిపారు.
ఈ మేరకు సీఎస్‌కు సచివా లయంలో నివేదిక అందించినట్టు తెలుస్తోం ది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తి అయి న నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ తిరుగు ప్ర యాణం కానున్నారు. శుక్రవారం సాయం త్రం బయలుదేరి కోల్‌కతాకు వెళ్లనున్నారు.