01-08-2025 01:27:26 AM
అక్రమ కట్టడాలకు చేదోడు వాదోడుగా..
అధికారుల జేబుల్లోకి అవినీతి డబ్బు
ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
ఇది టౌన్ ప్లానింగ్ సిబ్బంది భాగోతం
నిద్రపోతున్న విజిలెన్స్ శాఖ
గచ్చిబౌలి, జూలై 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కొలువు దీరినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రణాళికలు ముందుకు సాగుతుంటాయి. రోజు రోజుకు పెరుగుతున్న హైదరాబాద్ మహా నగర ఇమేజ్ ను కొంత మంది అధికారులు జేబులు నింపే అక్షయ పాత్రగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి పరిసర ప్రాంతాలలో ఐటీ కంపెనీలు నెలకొని ఉండటంతో కొండాపూర్, గచ్చిబౌలి, భారతి నగర్, మాదాపూర్ ప్రాంతాలలో నివసించడానికి ఎక్కువ మంది మక్కువ చూపిస్తుండటంతో భూముల విలువలు అమాంతం పెరిగిపోయాయి.
ఈ ప్రాంతాలలో నివాస అనుమతులు తీసు కొని ఎక్కువ శాతం వ్యాపార సముదాయాలు, హాస్టల్స్, ఓయో, అక్రమంగా బహుళ అంతస్తులు నిర్మిం చి అద్దెకు ఇవ్వడం వల్ల యజమానులు ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందుతున్నా రు. ఇదే అదునుగా భావించిన కొంత మంది అవినీతి అధికారులు ఈ ప్రాంతాన్ని తన అక్రమార్జనకు వాడుకుంటున్నారు.
గచ్చి బౌలి, మాదాపూర్ సర్కిళ్లలో అక్రమ భవన నిర్మాణదారులతో కుమ్మకైన కొంతమంది నగర ప్రణాళిక సిబ్బం ది అక్రమ నిర్మాణాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు బాహాటంగా నే చర్చిస్తున్న పరిస్థితి. ఇక్కడ నిర్మించే చాలా భవనాలు వారు తీసుకున్న అనుమతులకు మించి అక్రమంగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్న దృశ్యం, నివాస అనుమతులు తీసు కొని కమర్షియల్‌గా నిర్మించడం కనిపిస్తూనే ఉంది.
కొన్ని ప్రాంతాలలో కోర్టు కేసులు, భూ వివాదాల వల్ల ఆ ప్రాంతాలలోని సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్‌లో ఉండటంతో అనుమతులు తీసుకోకుండానే బహుళ అంతస్తులు నిర్మిస్తూ అధి కారుల జేబులు నింపుతుండటంతో పాటు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్న పరిస్థితి నెలకొంది.
అన్నింటా ఆ ఇద్దరే..
భవన అనుమతుల నుంచి అన్ని తామే అనే విధంగా నడుచుకుంటున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది పైన డిప్యూటీ కమిషనర్, ఆపై స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల భవన నిర్మాణాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతిని ఉన్నతాధికారులు గుర్తించలే కపోతు న్నారని అపవాదు ఉంది. పైస్థాయి అధికారుల వద్ద మంచి పేరు తెచ్చుకున్న గచ్చిబౌలి, మాదాపూర్ సర్కిళ్లలో పనిచేస్తున్న ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు పైఅధికారుల కళ్లు గప్పి అక్రమ నిర్మాణదారులతో చేతులు కలిపి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారని కిందిస్థాయి సిబ్బంది మాట్లాడుకుం టున్న పరిస్థితి ఉంది.
డిప్యూటీ కమిషనర్, ఆపై అధికారులు అన్ని విభాగాల అనుసంధానం చూడటం, అభివృద్ధి పనులలో బిజీగా ఉండటంతో ఈ ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తు కోట్లు గడిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. అక్రమ భవన నిర్మాణదారులకు కొంతమంది అధికారులు అన్ని తామే అయి, ఎవరైనా ఫిర్యాదు చేస్తే పైఅధికారులకు తెలియక ముందే సెటిల్ చేసుకో వాలని యజమానులకు కబురు పంపించడం కూడా డ్యూటీగా పెట్టుకున్నారని వినికిడి.
నిద్రపోతున్న విజిలెన్స్
కళ్ల ఎదురుగా కనపడుతున్న అక్రమ కట్టడాల విషయంలో విజిలెన్స్ అధికారులు కూడా పట్టించుకోకుండా ఉంటు న్న విషయం ప్రశ్నార్ధకంగా మారింది. అక్రమంగా బహుళ అంతస్తులు నిర్మించి వాటిలో హాస్టల్స్, ఓయో నడుపుతుండటంతో చుట్టుపక్కన ఉంటున్న ప్రజలకు నీటి, పార్కింగ్ సమస్య ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. అక్రమ కట్టడాలను తొలగించి, అవినీతి అధికారుల పైన ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండటంతో పాటు సామాన్య ప్రజలకు అధికారుల పట్ల గౌరవం ఏర్పడుతుంది.
శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం
మాదాపూర్ డివిజన్‌లో అక్రమ కట్టడాల పైన టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం ఉంది. కొన్ని అక్రమ కట్టడాలకు టౌన్ ప్లానింగ్ అధికారి బాహాటంగానే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంతకముందు ఇవన్నీ మా దృష్టికి రాలేదు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు. అక్రమ కట్టడాల పైన చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ నిర్మాణదా రులకు సపోర్ట్ చేస్తే సంబంధిత అధికారి పైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
డిప్యూటీ కమిషనర్ శశిరేఖ