26-01-2026 05:28:43 PM
గుడి వద్ద ఆందోళన
పోలీసులు చర్యలు తీసుకోకుంతే నిరసన కార్యక్రమాలు చేపడతాం
విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర ప్రముఖ్ మఠం రాచయ్య
షాద్‌నగర్,(విజయక్రాంతి): మైసమ్మ గుడి ని గుర్తు తెలియని వాహనం డీ కొనడం తో ద్వంసం అయింది. ఆదివారం రాత్రి ఫరూఖ్ నగర్ మండలానికి చెందిన కిసాన్ నగర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కిషన్ నగర్ గ్రామంలో నిన్న రాత్రి గుర్తు తెలియని వాహనం ద్వారా మైసమ్మ గుడి ధ్వంసం కావడంతో విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రముఖ్ మఠం రాచయ్య, రంగన్న, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, బజరంగ్దళ్ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా నిర్వహించారు.
పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా జరగని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడో చోట హిందూ దేవాలయాలపై దాడి జరుగుతుందని, ఇది పూర్తిగా క్షమించరాని నేరమని, దేవాలయాలపై దాడి జరపాలంటే భయం పుట్టే విధంగా పోలీసులు చర్యలు చేపట్టాలని, అసలు ఈ ధ్వంసం ఎందుకు జరిగిందో నిష్పక్ష పాత విచారణ ద్వారా పోలీసులు వెల్లడించాలని కోరారు. ఈ కార్యక్రమం లో రంగయ్య పాటు ఆర్ఎంపీ డాక్టరులు బుచ్చయ్య, రాజేంద్ర సింగ్, పద్మనాభం,ఆచారి రవి లతో పలువురు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.