calender_icon.png 26 January, 2026 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్య భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 05:32:19 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆర్యవైశ్య భవన్ లో జరిగిన కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ జెండా ఆవిష్కరించారు. ప్రధాన కార్యదర్శి తొడుపునూరి రాజేందర్ ప్రసాద్, కోశాధికారి కొమురవెల్లి (కేబి) శ్రీనివాస్ ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

రామిడి రవీందర్ ఇంటి వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అధ్యక్షులు రామిడి రవీందర్ జెండా ఆవిష్కరించారు,ప్రధాన కార్యదర్శి సముద్రాల శ్రావణ్ కుమార్, క్యాషియర్ పుల్లూరి రమేష్ తోపాటు వాసవి క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్లంకి వైకుంఠం ఇంటి వద్ద వాసవి వనిత మహిళా క్లబ్ అధ్యక్షురాలు ఎల్లంకి విజయ జెండా ఆవిష్కరించారు.

ప్రధాన కార్యదర్శి నార్ల మాధవి, క్యాషియర్ కొమురవెల్లి చంద్రకళతో పాటు మహిళా ప్రతినిధులు, వాసవి  క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణకు ముందు వాసవి మాత దేవాలయంలో ప్రతీక పూజలు చేయడం జరిగింది, పూజారి వల్ల కొండ మహేష్ పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. వైశ్య భవన్ ముందు గల  మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఆర్యవైశ్యులందరం నివాళులర్పించడం జరిగింది..