calender_icon.png 26 January, 2026 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందమర్రిలో అట్టహాసంగా సింగరేణి గణతంత్ర వేడుకలు

26-01-2026 05:10:47 PM

- పాల్గొన్న జీఎం రాధాకృష్ణ

- ఉత్తమ ఉద్యోగులకు సన్మానాలు 

- అలరించిన సాంస్కృతిక నృత్యాలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన 77వ గణతంత్ర వేడుకలు అలరించాయి. ఈ వేడుకలు  సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్  N. రాధాకృష్ణ, మందమర్రి ఏరియా సేవా అధ్యక్షురాలు N.శ్రీవాణి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటోలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగరవేశారు.

అనంతరం S&PC సిబ్బంది, RRRT సిబ్బంది పాఠశాల విద్యార్థులతో గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకలను ఉద్దేశించి జీఎం రాధాకృష్ణ కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకత,కంపెనీ సంక్షేమాల  గూర్చి ప్రసంగించారు. అనంతరం మందమర్రి ఏరియాలోని 10 మంది ఉత్తమ ఉద్యోగులను, ఘనంగా సన్మానించారు. కోల్ ఇండియా లో గోల్డ్ మెడల్ సాధించిన నీలాల శ్రీనివాస్  బృందం సభ్యులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా  పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, చేసిన  నృత్యాలు అందరినీ అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో SO TO GM G.L ప్రసాద్, AITUC మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ, అధికారుల సంఘం  అధ్యక్షులు  రమేష్, DGM పర్సనల్ అశోక్, ఏరియా ఇంజనీర్ ఈ అండ్ ఎం బాలాజీ భగవతిజ, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, జి.ఎం ఆఫీస్ అధికారులు, సిబ్బంది, అన్ని గనుల డిపార్ట్మెంట్ అధికారులు, సంక్షేమ అధికారులు, కార్మికులు, యూనియన్ నాయకులు,  విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పుర ప్రజలు పాల్గొన్నారు.