calender_icon.png 1 July, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర సాంస్కృతిక మండలి సలహాదారుడిగా నాగరాజు

01-07-2025 01:57:41 AM

మందమర్రి, జూన్ 30 : తెలంగాణ రాష్ట్ర భాష సంస్కృతిక మం డలి సలహాదారుడిగా పట్టణానికి చెందిన తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాగరాజుకు కేసీఆర్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తుందని అందరు భావించినప్పటికీ ఆయనను పట్టించుకోలేదు.

తాజాగా రాష్ట్ర భాషా సాంస్కృతిక మండలి సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నాగరాజు హార్షం వ్యక్తం చేశారు. తనను రాష్ట్ర సాంస్కృతిక మండలి సలహదారునిగా నియమించ డంపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు.