calender_icon.png 1 July, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు మంచిర్యాల గురుకుల విద్యార్థులు

01-07-2025 01:59:12 AM

మంచిర్యాల, జూన్ 30 (విజయక్రాంతి) :మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల వద్ద గల మంచిర్యాల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ కె మోహన్ సోమ వారం వెల్లడించారు.

జూన్ 29న మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి ‘సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ - పరుగు పందెం‘లో 12 సంవ త్సరాల విభాగంలో ఏ. అరుణ్ కుమార్ (థాయిలాంన్ లాంగ్ జంప్, 60 మీటర్ల పరుగు పందెం, 600 మీటర్ల పరుగు పందెంలో), 14 సంవత్సరాల విభాగంలో జి. సాయి చర ణ్ (కిడ్స్ జావలిన్‌లో) ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు తెలిపారు.

వీరు ఈ నెల 6న హన్మ కొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో పాటు కళాశాల పీడీ కుమ్మరి శ్రీకాంత్, పిఈటి మారెపాక సాగర్ లను కళాశాల ప్రిన్సిపాల్ తోపాటు సీనియర్ వైస్ ప్రిన్సిపల్ కే. మహేశ్వరరావు, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రమేష్, సీనియర్ ఆధ్యాపకు డు డాక్టర్ పి. నగేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.