01-05-2025 12:00:00 AM
నాగారం ఏప్రిల్ 30: ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన నాణ్యమైన విద్యా విధానాన్ని అమలవుతుందని మండల విద్యావనరుల అధికారి వాసం ప్రభాకర్ అని అన్నారు. ఆయన మాట్లాడుతూ మార్చి 2025 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నాగారం మండలం మహాత్మా రావ్ జ్యోతిబాపూలే పాఠశాల నుండి 568 బి నందకుమార్ , 551 ఎస్ హర్షవర్ధన్ 549 బి నిశ్వంత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి ఫణిగిరిలో పి పూజ 545 పసునూరి ఆదర్శ పాఠశాల జె శివ గణేష్ 545 జడ్పీహెచ్‌ఎస్ ఈటూరు మేడబోయిన ప్రశాంత్ 541 .ప్రైవేట్ పాఠశాల మేరీ మదర్ నుండి 559 మార్కులతో సాయిశ్రీ 554 లక్ష్మీ ప్రసన్న 553 బండ గొర్ల శ్రావణి మూడవ ర్యాంకులో ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల కు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అని అన్నారు . ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బృందాలు అభినందించారు.