14-07-2025 02:02:08 AM
నాగార్జునసాగర్/ నాగర్‌కర్నూల్/ వనపర్తి, జూలై 13(విజయక్రాంతి): ఎగు వ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఫలితంగా నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 62,983 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 1,650 క్యూసెక్కులుగా నమోదైంది.
సాగర్ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 552 అడుగుల వద్ద కొనసాగుతుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 211 టీఎంసీల నీరు ఉంది. వరద ఉద్ధృతి కొనసాగితే నెలాఖరు నాటికి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి ఆదివారం 73,586 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
సుంకేసుల నుంచి 30,728 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండటంతో అధికారులు ఒక గేటు ద్వారా నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంట ల వరకు ఎగువ ప్రాంతం నుంచి 80 వేల క్యూసెక్కుల వరద నీరు జూరాల ప్రాజెక్టుకు రాగా 7 గేట్ల ద్వారా 84,087 క్యూ సెక్కుల వరద నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేసినట్టు అధికారులు వెల్లడించారు.
సాయంత్రం 6 గంటలకు వెల్లడిం చిన వివరాల ప్రకారం ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కులు వరద నీరు రాగా ఒక్క గేటు నుంచి మాత్రమే నీళ్లను వదలైనట్టు తెలిపారు. స్పీల్ వే నుంచి 6,823 క్యూసెక్కులు, పవర్‌హౌస్‌కు 36,035 క్యూసెక్కు లు, నెట్టెం పాడు ప్రాజెక్టుకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌కు 1,300 క్యూసెక్కులు, కోయల్‌సాగర్ ప్రాజెక్టుకు 315 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1,030 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 470 క్యూసె క్కులు, ఇతర కాలువల ద్వా రా 750 క్యూసెక్కులు వరద నీరు 47,068 క్యూసెక్కులు వరద నీరు ప్రాజెక్టు నుంచి బయ టకు విడుదల చేశారు.