14-09-2025 07:08:37 PM
నకిరేకల్,(విజయక్రాంతి): ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం వితరణ చేస్తూ పేద ప్రజల ఆకలి తీర్చడం అభినందనీయమని లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో,మార్కెట్ రోడ్డు వద్ద 150 మందికి పేదలకు అల్పాహారాన్ని నకిరేకల్ వాస్తవ్యులు కీర్తిశేషులు వీర్లపాటి జనార్దన్ జ్ఞాపకార్ధంగా వారి కుమారులు వీర్లపాటి సైదులు.. వీర్లపాటి సతీష్.. వీర్లపాటి నరేష్ ల సహకారంతో అందించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ... వివిధ ప్రాంతాలలో లయన్స్ క్లబ్ లు చేపట్టే అన్నదాన కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు.జయంతి వేడుకలు.. పెళ్లిరోజు వేడుకలు.. దశదినకర్మలు.. జ్ఞాపకార్థాల సందర్భంగా దాతలు లయన్స్ క్లబ్ ల ద్వారా చేయూతన అందించాలని కోరారు.