calender_icon.png 27 July, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలుడిని కాపాడిన నల్గొండ టూ టౌన్ పోలీసులు

27-07-2025 05:45:34 PM

జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువ..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తల్లిద్వారా నిర్లక్ష్యంగా వదిలివేయబడిన రెండు సంవత్సరాల బాలుడిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించిన నల్గొండ టూ టౌన్ పోలీసులు(Nalgonda 2 Town Police) ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. బస్టాండ్‌లో ఏడుస్తూ ఒంటరిగా ఉన్న చిన్నారిని గుర్తించిన ఆర్టీసీ సిబ్బంది ఆదివారం తక్షణమే టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే టూ టౌన్ ఎస్ఐ సైదులు(SI Saidulu) తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని తగిన ఆధారాలతో విచారణ ప్రారంభించారు.

సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి బాలుడిని బస్టాండ్‌లో వదిలి తల్లి ఒక అన్య వ్యక్తితో బైక్ పై వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులను గుర్తించి పిలిపించగా, వారితో సుదీర్ఘ కౌన్సిలింగ్ నిర్వహించి, చట్టబద్ధంగా బాలుడిని తిరిగి అప్పగించారు. ఈ ఘటనపై నల్గొండ జిల్లా పోలీసులు, ప్రజలు, శిశు సంక్షేమ సంస్థలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. టూ టౌన్ పోలీసుల స్పందన వలన ఒక బాలుడి భవిష్యత్తు కాపాడబడ్డదని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.