27-07-2025 05:48:37 PM
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్..
చండూరు (విజయక్రాంతి): గంజాయి డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్(DYFI District Secretary Mallam Mahesh) అన్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ లను అరికట్టాలని నిర్వహిస్తున్న యువ చైతన్య సైకిల్ యాత్ర ఆదివారం చండూరు మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అధ్యక్షతన నిర్వహించిన స్వాగత సభలో ఆయన మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని రోజురోజుకు గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోతుందన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా లక్షల రూపాయలు పోగొట్టుకొని అనేక కుటుంబాలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని యువత ఎక్కువగా వీటికి బానిసలుగా మారుతున్నారన్నారు. ప్రభుత్వాలు వీటిని పూర్తిగా అరికట్టాలన్నారు.
గంజాయి డ్రగ్స్ మనిషిని విచక్షతను కోల్పోయే విధంగా చేస్తుందని ఆ మైకంలో అనేక నేరాలు చేస్తున్నారని పేర్కొన్నారు. యువత చెడు దారి పట్టకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పెంపొందించాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు పుల్లెంల శ్రీకర్ మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి తీసుకునే వారిని, రవాణా చేసే వారిని గతంలో పోలీస్ శాఖ వారు కొంతమందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడము మరియు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న వారిపై కూడా చర్యలు ఉండాలని తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనేటటువంటి పర్యవేక్షణ కూడా ప్రతి తల్లిదండ్రులకు ఉండాలని విజ్ఞప్తి చేశారు.ఎలాంటి బెట్టింగ్లకు వెళ్లకుండా తన జీవితాలను కాపాడుకొని మంచి మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ సైకిల్ యాత్ర సభ్యులు వడ్డగాని మహేష్ , గుండాల నరేష్, రాజేష్, చంద్రశేఖర్, పగిళ్ల సాయి తేజ, రాజేష్, గోపి ,మండల ఉపాధ్యక్షులు రావుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.