calender_icon.png 28 July, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నా రండి-హార్ట్లీ వెల్కమ్

27-07-2025 11:15:51 PM

తన క్యాంపు కార్యాలయానికి తొలిసారి వచ్చిన వాకిటికి ఘనస్వాగతం పలికిన పొంగులేటి..

ఖమ్మం (విజయక్రాంతి): అన్నా రండి, హార్ట్లీ వెల్కమ్ అంటూ తొలిసారి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయానికి ఆదివారం వచ్చిన తెలంగాణ పశు సంవర్థక శాఖ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరికి తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) ఘనస్వాగతం పలికారు. కొత్తగూడెం నియోజకవర్గ పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తున్న వాకిటి శ్రీహరిని తన క్యాంపు కార్యాలయానికి రావాలని మంత్రి పొంగులేటి ఆహ్వానించారు. తన ఆహ్వానం మేరకు విచ్చేసిన వాకిటికి శాలువా కప్పి మెమోంటోతో ఘనంగా పొంగులేటి సత్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా విశేషాలు మంత్రి పొంగులేటి శ్రీహరికి వివరించారు.