27-07-2025 11:19:49 PM
యంఆర్పియస్ జిల్లా ఇంచార్జి బచ్చల కూరి వెంకటేశ్వర్లు..
మోతె: జాతిని జాగృతం చేయని వాడు జాతికి ద్రోహం చేసినట్లేనని యంఆర్పియస్ జిల్లా ఇంచార్జి బచ్చల కూరి వెంకటేశ్వర్లు(District Incharge Bachalakuri Venkateswarlu) అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో స్వస్తిక్ పంక్షన్ హాలో జరిగిన యంఆర్పియస్ మండల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... సబ్బండ కులాలకు సేవ చేసేది యంఆర్పియస్ మాత్రమేనని చెప్పారు. సమాజంలో వికలాంగులను దూరం చేసినప్పటికీ వికలాంగుల సామజ్యాన్ని చేరదీసిన యంఆర్పియస్ పెన్షన్లు పెంచడం కోసం అనేక ఉద్యమాలు చేయడం జరిగిందని తెలిపారు. యంఆర్పియస్ గ్రామ గ్రామాన బలోపేతం చేసి పార్టీలకు అతీతంగా జాతిని నిర్మించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్ కోసం కృషి చేయాలి డాక్టర్లు గా ఇంజనీర్లు గా లాయర్లు గా ఉన్నత విద్యా కోసం ప్రతి ఒక్కరికి వైద్యం కోసం పని చేసి భవిష్యత్ ను నిర్మించుకోవాలని కోరారు. ఇప్పటికీ గ్రామాలలో యం ఆ ర్ పి యస్ గద్దె నిర్మాణం త్వరగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యం ఆర్ పి యస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, జిల్లా కార్యదర్శి మార పంగు రామంజయ్య, యం ఆర్ పి యస్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లపల్లి లెనిన్ మాదిగ, యం జె ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి పల్లెల లక్ష్మణ్, యం జె ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కాం పాటి వెంకన్న, మండల ఇంచార్జి బొడ్డు కుటుంబరావు, పల్లెల రాము, సుందర్, చిరంజీవి, గంగాధర్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.